Sports | సృజనాత్మకతను వెలికి తీస్తాయి ..

Sports | సృజనాత్మకతను వెలికి తీస్తాయి ..
- మండల విద్యాధికారి బాబు సింగ్
Sports | వికారాబాద్, ఆంధ్రప్రభ : ట్రస్మా ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఇండోర్ క్రీడలు నిర్వహించారు. ఈ పోటీల్లో 26 ప్రైవేట్ పాఠశాలలు పాల్గొన్నాయి. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మండల విద్యాధికారి, ట్రస్మా రాష్ట్ర కోరు కమిటీ సభ్యులు మాట్లాడుతూ… విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు క్రీడలు ఎంతో అవసరమని వికారాబాద్ మండల విద్యాధికారి బాబు సింగ్ అన్నారు. ట్రస్మా వికారాబాద్ శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు రెండు రోజులపాటు ఇండోర్ గేమ్స్ ను శ్రీ వివేక వాణి విద్యాలయంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బాబు సింగ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… విద్యార్థులు విద్యతోపాటు, శారీరిక, మానసిక దృఢత్వం కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన కోరారు. విద్యార్థులు సెల్ఫోన్లను వాడకూడదని, సెల్ ఫోన్ వలన జ్ఞాపక శక్తి తగ్గుతుందని అదేవిధంగా కండ్లకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. తల్లిదండ్రులు మీ పిల్లలను వందకు వంద మార్కులు రావాలని కోరుకోవడం కంటే అన్నిట్లోనూ 80-90 శాతం మార్కులు వచ్చిన 100 వచ్చినట్లేనని ఆయన తెలిపారు.
అనంతరం ట్రస్మ రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్ ఎం. నాగయ్య మాట్లాడుతూ… విద్యార్థులు కేవలం మార్కుల కోసం కాకుండా సమాజం మీద అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నేడు ఏఐ లాంటి సాంకేతిక పరిజ్ఞానాలు రావడంతో అందుకు తగ్గట్లుగా విద్యార్థులు పాఠశాల దశ నుంచే సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు.
ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి చూపాలని, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కూడా కేవలం మార్కులపై దృష్టి పెట్టకుండా క్రీడల పట్ల కూడా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. ట్రస్మా ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇండోర్ క్రీడలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహా కార్యదర్శి బసవరాజ్, జిల్లా అధ్యక్షుడు ఎన్. వెంకట్ రెడ్డి, జిల్లా కోశాధికారి వీ. ప్రకాష్ చారి, పట్టణ అధ్యక్షుడు సి. చంద్రశేఖర్, కార్యదర్శి ప్రవీణ్ కుమార్, కోశాధికారి సుధీర్ వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు.
