10 numbers | జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్

10 numbers | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసాలో కాల్పుల మోత మోగుతోంది. జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని కిరిబురు, ఛోటానాగ్ర పోలీస్ స్టేషన్ల పరిధిలోని కుమ్డి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని సరంద అటవీ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
జార్ఖండ్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ కోబ్రా 209 బెటాలియన్ దళాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా, పొంచి ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీనికి ధీటుగా భద్రతా బలగాలు ఎదురుదాడి చేయడంతో గంటల పాటు భీకర పోరు కొనసాగింది. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది.
ఈ క్రమంలో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టులు మరణించినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ నాయకుడు మిసిర్ బెస్రా తో పాటు మరికొందరు కీలక సభ్యులు ఉన్నట్లుగా సమాచారం.
