Chiranjeevi | విశ్వంభర తెర వెనుక ఏం జరుగుతోంది..?

Chiranjeevi | విశ్వంభర తెర వెనుక ఏం జరుగుతోంది..?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ రికార్డు కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. ఈ మూవీ మెగాస్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో మెగా ప్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. అప్పుడు వాళ్ల దృష్టి విశ్వంభర పై పడింది. ఈ సినిమా ఎప్పుడో రావాలి కానీ.. కొన్ని కారణాల వలన ఇంత వరకు రిలీజ్ కాలేదు. ఇప్పుడు చిరు ఫుల్ జోష్ లో ఉన్నారు. మరి.. విశ్వంభర పరిస్థితి ఏంటి..? అసలు తెర వెనుక ఏం జరుగుతోంది..?

విశ్వంభర సినిమాని డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ తెరకెక్కిస్తున్నారు. ఆమధ్య గ్లింప్స్ రిలీజ్ చేస్తే.. క్వాలిటీ విషయంలో విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి మేకర్స్ క్వాలిటీ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం విశ్వంభరకు బాగా కలిసొచ్చే అంశం. ఇప్పుడు ఈ సినిమా ఇచ్చిన కిక్ తో మరింత స్పీడుగా వర్క్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి తర్వాత నుంచి విశ్వంభర సీజీ వర్క్ ను మళ్లీ స్టార్ట్ చేశారట. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏడెనిమిది దేశాల్లో వర్క్ చేస్తున్నారని సమాచారం.

ఇంతకీ.. విశ్వంభర ఎప్పుడు వస్తుందంటే.. ఇంకా క్లారిటీ లేదు కానీ.. సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అంశాలు చాలా ఉన్నాయట. ముఖ్యంగా పిల్లలకు నచ్చే ఎపిసోడ్స్ ఉన్నాయట. అందుకని సమ్మర్ లో రిలీజ్ చేయాల్సిందే అని చిరు గట్టిగా ఫిక్స్ అయ్యారు అంటున్నారు. మరో వైపు అప్పటి లోగా ఓటీటీ డీల్స్ కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. ఏప్రిల్ లేదా మే నెలలో విశ్వంభర థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్.

