Teacher | నైతిక విలువలు పెంపొందించడంలో ముందుండాలి….

Teacher | నైతిక విలువలు పెంపొందించడంలో ముందుండాలి….
- తాపస్ రాష్ట్ర కార్యదర్శి రాఘవరెడ్డి….
Teacher | బిక్కనూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులకు జాతీయభావం నైతిక విలువలు పెంపొందించడంలో ఉపాధ్యాయులు ముందుండాలని రాష్ట్ర తాపాస్ కార్యదర్శి పులగం రాఘవరెడ్డి చెప్పారు. ఈ రోజు మండలంలోని తిప్పాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కర్తవ్య బోథ్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్(Subhash Chandra Bose) చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… భరతమాతను విశ్వగురు స్థానంలో నిలుపుటకు ఉపాధ్యాయులు విద్యార్థుల ముందు ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.
ఇటీవల రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను పాఠశాల అధ్యాపక బృందం శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం యాదగిరి, ఉపాధ్యాయులు వాణి శ్రీ, ఉమారాణి, విష్ణు ప్రియ, నరసింహారెడ్డి, సురేష్, అజ్జు, ఫయాజ్ విద్యార్థులు ఉన్నారు.
