Devara 2 | ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్నారా..?

Devara 2 | ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్నారా..?

Devara 2 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ (Koratala Shiva) కాంబినేషన్లో రూపొందిన చిత్రం దేవర. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం. ఎందుకంటే.. ఈ మూవీకి నెగిటీవ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. అయితే.. దేవర 2 ఉంటుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు దేవర 2 లో కళ్యాణ్‌ రామ్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఇంతకీ.. ఇది నిజమేనా..?

Devara 2

Devara 2 | దేవర 2 ఉందా…

దేవర సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో.. దేవర 2 ఉండదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే.. స్వయంగా ఎన్టీఆర్ దేవర 2 ఉంటుందని చెప్పడంతో.. ఇక ఈ ప్రాజెక్ట్ పక్కా ఉంటుందని నమ్మకం ఏర్పడింది. ఎప్పుడైతే ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో (Trivikram) మైథలాజికల్ మూవీ చేయడానికి ఓకే చెప్పాడో అప్పటి నుంచి దేవర 2 లేదు అంటూ మళ్లీ ప్రచారం మొదలైంది. ఇటీవల దేవర రిలీజై సంవత్సరం పూర్తైన సందర్భంగా దేవర 2 ఉంటుందని స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో మళ్లీ దేవర 2 ఉందని వార్తలు వచ్చాయి. ఇలా దేవర 2 ఉంటుందా..? ఉండదా..? అనేది సస్పెన్స్ గా మారింది.

Devara 2

Devara 2 | నిజమైతే పండగే..

ఇదిలా ఉంటే.. తాజాగా దేవర 2 లో కళ్యాణ్‌ రామ్ నటించబోతున్నాడని.. ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంతే కాదండోయ్ అన్నదమ్ములు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. (Kalyan Ram) ఇద్దరూ బద్ధ శత్రువులుగా నటించబోతున్నారట. ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్ ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలని నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు. ఇప్పుడు ఈ వార్త బయటకు రాగానే.. ఇది నిజమో, గాసిప్పో తెలియదు గానీ.. నిజమైతే బాగుటుందని అభిమానులు కోరుకుంటున్నారు. అదే కనుక జరిగితే నందమూరి అభిమానులకు పండగే. ప్రస్తుతం దేవర 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో కొరటాల బిజీగా ఉన్నారు. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Devara 2

CLICK HERE TO READ పాన్ ఇండియా స్టార్‌తో గొడవ పడిందా..?

CLICK HERE TO READ MORE

Leave a Reply