Mahesh Babu | గౌతమ్ అప్పుడే హీరో కాబోతున్నాడా..?

Mahesh Babu | గౌతమ్ అప్పుడే హీరో కాబోతున్నాడా..?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కృష్ణ, మహేష్ బాబు సూపర్ స్టార్స్ గా ఎంతలా పేరు తెచ్చుకున్నారో చూశాం. ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మూడోతరం.. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు తనయుడు గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు రావడం ఆసక్తిగా మారింది.
అప్పుడే గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడా అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. గౌతమ్ ని హీరోగా పరిచయం చేసేందుకు ఇద్దరు నిర్మాతలు పోటీపడుతున్నారట. ఇంతకీ.. ఆ ఇద్దరు నిర్మాతలు ఎవరు..?

గౌతమ్.. 1 నేనొక్కడినే సినిమాలో నటించాడు. మహేష్, గౌతమ్ ఇద్దర్నీ తెర పై చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం గౌతమ్ అమెరికాలో ప్రొఫెషనల్ యాక్టింగ్ కోర్స్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వెండితెరకు పరిచయం చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. గౌతమ్ కు సంబంధించి ఏ ఫోటో బయటకు వచ్చినా వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గౌతమ్ లుక్ కూడా మహేష్ బాబులా ఉండడంతో.. హీరోగా తెర పై చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే.. గౌతమ్ ఫస్ట్ మూవీని నిర్మించేందుకు సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర పోటీపడుతున్నారని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్త లీకైనప్పటి నుంచి ప్రొడ్యూసర్స్ ఓకే.. మరి డైరెక్టర్ ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది.

గౌతమ్ ఫస్ట్ మూవీని డైరెక్ట్ చేయడం అంటే మాటలు కాదు.. ఎందుకంటే.. ఘట్టమనేని లెగసీని ముందుకు తీసుకెళ్లాలి. గౌతమ్ పై అంచనాలు భారీగా ఉంటాయి. కృష్ణ, మహేష్ బాబు స్టార్ డమ్ తర్వాత గౌతమ్ ను ప్రజెంట్ చేయాలంటే ఏ డైరెక్టర్ కు అయినా కత్తి మీద సామే. అలాగే గౌతమ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం అంటే అదృష్టం కూడా ఉండాలి. మరి.. ఆ లక్కీ ఛాన్స్ ఏ దర్శకుడుకు దక్కుతుందో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.
