Village Health Clinics | పేద‌ల‌కు మెరుగైన వైద్యం..

Village Health Clinics | పేద‌ల‌కు మెరుగైన వైద్యం..

  • విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ఏర్పాటు
  • గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

Village Health Clinics | నందివాడ, ఆంధ్రప్రభ : గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో హెల్త్ క్లినిక్స్ సేవలు చేస్తున్నామన్నారు. మండల కేంద్రమైన నందివాడ గ్రామంలో రూ.36 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులకు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భూమి పూజ నిర్వహించి సోమవారం శంకుస్థాపన చేశారు.

Village Health Clinics

ఈ సందర్భంగా భవన నిర్మాణానికి 6 సెంట్లు స్థలాన్ని దాతృత్వంగా అందించిన వేములపల్లి కాశి వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే రాము అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలో ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో ఐదు హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే నాలుగు క్లినిక్‌ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని, వాటిని త్వరగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే అన్నారు.

గ్రామాల్లో ఈ క్లినిక్ ల ఏర్పాటు ద్వారా ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ అవుతాయన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, సహకరించడం శుభపరిణామం అన్న ఎమ్మెల్యే రాము, స్థలదాతలకు ధన్యవాదాలు చెప్పారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా నందివాడ మండలంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. గ్రామాల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా… నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రాము ఉద్ధాటించారు.

ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్‌డ‌బ్ల్యుసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, టీడీపీ మండల అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, టీడీపీ నాయకులు ఆరికేపూడి రామశాస్త్రి, సీతయ్య, ప్రభాకర్ రెడ్డి, సల్మాన్ రాజ్, యేసుపాదం, మసిముక్కు వేణు, మురళి, ఉప్పల వెంకటేశ్వరరావు, DC యేసు బాబు, అంజిరెడ్డి, బాబిరెడ్డి, సుంకర శ్రీను, సతీష్, భద్రం, లక్ష్మీపతి, దారం శ్రీనివాసరావు, నిమ్మకూరు జోలయ్య, ఏడుకొండలు, అశోక్‌, నేరుసు నాగరాజు, వీర్ల లోకేష్, మందపాటి నాగరాజు, యాదయ్య, వెయ్యల నాగయ్య, ఎంపీడీఓ మల్లీశ్వరి, డీఈ రవి, ఏఈ పీఆర్ రవి, డాక్టర్ జాయిస్. మంజూష, డాక్టర్ స్ఫూర్తి సింధూషా, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply