TG | బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక విధ్వంసం! – మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌: పదేళ్ల బీఆర్ఎస్ ప్రభత్వ హయాంలో రాష్ట్రంలో ఊహించని రీతిలో ఆర్ధిక విధ్వంసం జరిగిందని ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అంబర్‌పేట్ నియోజకవర్గంలో ఆయ‌న‌ పర్యటించారు. అదేవిధంగా పలుచోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ కుటుంబం రూ.కోట్లు కొల్లగొట్టిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ, బీఆర్ఎస్ అడ్డంకిగా మారాయని ఫైర్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటకం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఇక నుంచి అయినా రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం తమ సంపూర్ణ సహకారాన్ని అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply