Pedda Mallareddy | భక్తులతో కిటకిటలాడిన దేవేంద్రుని గుట్ట…

Pedda Mallareddy | భక్తులతో కిటకిటలాడిన దేవేంద్రుని గుట్ట…
Pedda Mallareddy | బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామ శివారులో గల దేవేంద్రుని గుట్ట ఇవాళ భక్తులతో కిటకిటలాడింది. మాఘ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని పలు గ్రామాల నుండి వేలాది మంది భక్తులు కుట్ట పైకి తరలివచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులు రావడంతో గుట్ట ప్రాంతం భక్తులతో నిండిపోయింది. గుట్టపైన ఉన్న కోనేరులో భక్తులు తలస్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. గుట్టపై పెద్ద ఎత్తున జాతర నిర్వహించారు. పలు ప్రాంతాల నుండి గుట్ట పైకి వచ్చిన భక్తులకు ఉచితంగా మినరల్ వాటర్ ను పలువురు దాతలు పంపిణీ చేశారు.

మండలంలోని కాచాపూర్ గ్రామ శివారులో గల బొమ్మల్దేవ్ పోచమ్మ ఆలయం వద్ద మాఘ అమావాస్య జాతర నిర్వహించారు. గ్రామంతో పాటు మాందాపూర్, సంగమేశ్వర్ గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు తరలివచ్చారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మండలంలోని జంగంపల్లి గ్రామంలో గల గంగమ్మ ఆలయం వద్ద మాఘమాస జాతర నిర్వహించారు. గ్రామానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు తరలివెళ్లారు. అక్కడ జరిగిన జాతరలో భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
