kuntala | క్రీడలతో యువతకు ఉజ్వల భవిష్యత్తు

kuntala | క్రీడలతో యువతకు ఉజ్వల భవిష్యత్తు
kuntala | కుంటాల, ఆంధ్రప్రభ : క్రీడలతో యువతకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని.. క్రీడాలను అలవర్చుకోవాలని స్థానిక సర్పంచ్ ఎర్రోజ్ ప్రవలి ప్రశాంత్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరవేణి నర్సా గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం కుంటాల మండలంలోని అందకూర్ గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ముగియడంతో గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. నిత్యం క్రీడలు వాడడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటుతూ గెలుపోటములను సమానంగా స్వీకరించాలని అన్నారు. జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రథమ బహుమతి గెలుపొందగా రూ. 5వేలు ద్వితీయ బహుమతి, రూ. 3 వేలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జీవన్ రావు మాజీ సర్పంచ్ కిషన్, శ్రీశైలం గౌడ్,రాసింద్ర గౌడ్, మాజీ ఉప సర్పంచ్ వినోద్, సంగం గంగాధర్, బోండా రవి, విక్రమ్, సృజన్, సాయిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
