TG | ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటన..

TG | ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటన..

  • మాజీ మంత్రి జోగు రామన్న, బిఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్..!

TG | ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నేతలను ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న నివాసం వద్ద పోలీసులు అర్ధరాత్రి నుంచి గస్తీ కాచి, ఈ రోజు ఉదయం గృహ నిర్బంధంలో ఉంచారు. సీఎం పర్యటనను అడ్డుకుంటామని, చేనాక కోర్ట ప్రాజెక్టు బిఆర్ఎస్ ప్రభుత్వమే నిర్మించిందని, సీఎం రేవంత్ కు ప్రాజెక్టు ప్రారంభించే నైతిక అర్హత లేదని జోగు రామన్న ముందుగా ప్రకటన జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ పార్టీ నేతలు బయటకు వెళ్లకుండా ముందస్తుగా జాగ్రత్తపడ్డారు. ఆ పార్టీ నేతలను రాత్రిపూట అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

TG

TG | సీఎం రేవంత్ ట్రయల్ రన్ కు రావడం సిగ్గుచేటు..

ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చనకా కొరటా ప్రాజెక్టు ట్రయల్ రన్ కు రావడం సిగ్గుచేటని, తమ పాలనలోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేశామని సీఎంకు నైతిక అర్హత లేదని మాజీ మంత్రి రామన్న విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా రైతులకు 51 వేల ఎకరాలకు నీరు అందించాలన్న సంకల్పంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారని తెలిపారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేదన్నారు. ఈ ప్రాజెక్టు ట్రయల్ రన్ చేయడం, దాన్ని ప్రారంభించడం తగదన్నారు.

TG | అరెస్టులు అప్రజాస్వామికం..!

బేల, జైనథ్, ఆదిలాబాద్ మండల నాయకులను అరెస్టులు చేయడం ప్రజాస్వామిక చర్యగా జోగు రామన్న పేర్కొన్నారు. ఒక్క చుక్క కూడా నీరు అందించలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను రైతులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. రైతు సమస్యలు పరిష్కరించడంపై ధ్యాసలేని ఈ ముఖ్యమంత్రి కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ట్రయల్ రన్ అంటూ మోస గిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్, ఎంపీ గోడం నగేష్ రైతుల పట్ల కనీస అవగాహన లేకుండా ట్రయల్ రన్ అడ్డుకోకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ బిజెపి రెండూ రైతు వ్యతిరేక ప్రభుత్వాలు అని దుయ్యబట్టారు.

Leave a Reply