Cold intensity | పెరిగిన ఉష్ణోగ్రతలు

Cold intensity | పెరిగిన ఉష్ణోగ్రతలు
- ఉపశమనం పొందుతున్న ప్రజలు
Cold intensity | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండగ వచ్చిందంటే సంకల లేపనంతగా చలి ఉంటుందని అంటున్నారు. కానీ ఈ ఏడాది సంక్రాంతి పండగ వచ్చేసరికి చలి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. కొన్ని రోజులపాటు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి చలి (COLD) వణికించగా.. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు కాస్త పెరగడంతో ప్రజలకు ఉపశమనం లభించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రానున్న మూడ్రోజులపాటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని హైదరాబాద్ (Hyderabd) వాతావరణ కేంద్రం తెలిపింది.

గత కొన్ని నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాలను చలి పులి చంపేసింది. బయటకు రావాలంటేనే జనం భయపడిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే భోగి నాటి నుంచి చలి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. వాయుగుండం ప్రభావంతో అక్కడ కక్కడ ఏపీలో వానలు కురుస్తున్నా ఉష్ణోగ్రతలు కొంత పెరిగినట్లే కనిపిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చలి తీవ్రత తగ్గింది. నిన్నటి వరకూ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయిన ప్రాంతాల్లోనూ డబుల్ డిజిట్ (Digit) ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రానున్న కాలంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

