Sankranti | చిన్నారులకు… భోగి పండ్లు

Sankranti | చిన్నారులకు… భోగి పండ్లు

Sankranti | కుంటాల, ఆంధ్రప్రభ : భోగి పండుగ పురస్కరించుకొని మొదటి రోజు కుంటాల మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లోని భోగి పండుగ సందర్భంగా ఐదేళ్ల లోపు చిన్నారులకు భోగిపండ్లు పోసి మహిళలు ఒకరికొకరు నోములను సమర్పించుకున్నారు. అజ్ఞానాన్ని, దోషాలని వదిలి జ్ఞానంతో ఉండాలని పాత వస్తువులను కూడా భోగి మంటల్లో వేయడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. పిల్లలకు రేగు పండ్లతోనే భోగి పండ్లు అని సంభోదిస్తారు.

చిల్లర పైసలు, చెరుకు గండాలు, చాక్లెట్లు అన్నీ కలిపి పిల్లలకు తలపై పోస్తారు. దీంతో ఘనంగా భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని చిన్నారులకు రేగు పండ్లతో మహిళలు పాటలు పాడుతూ సాంప్రదాయ పద్ధతిలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా మహిళలు వివిధ రకాల నోములను సమర్పించుకున్నారు. పసుపు కుంకుమలు పెట్టుకుని ఒకరికొకరు నోములు సమర్పించుకుంటూ భోగి ఆవశ్యక‌తను వివరించారు. దీంతో భోగి పండుగ సంతోషంగా జరుపుకున్నారు.

Leave a Reply