Jainoor | మంచి వ్యక్తిని కోల్పోవడం బాధాకరం : ఎమ్మెల్యే

Jainoor | మంచి వ్యక్తిని కోల్పోవడం బాధాకరం : ఎమ్మెల్యే
Jainoor | జైనూర్, ఆంధ్రప్రభ : నిరుపేదల కోసం సామాజిక కార్యక్రమాలు నిర్వహించి, అనేక అభివృద్ధి పనులు చేసి మంచి కాంట్రాక్టర్ గా పేరుపొందిన ఎండి ఫాజిల్ బియాబాని గుండెపోటుతో మృతిచెందిన ఎంతో బాధాకరమని అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. ప్రముఖ కాంట్రాక్టర్ సదర్ సేవకుడు ఫాజిల్ బియబాని గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకొని నాయకులతో కలిసి ఇవాళ కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను తమ్ముడైన ప్రముఖ కాంట్రాక్టర్ ముంతాజ్ బియబాని, హైమద్ బియబానిలను పరామర్శించారు.
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎండి ఫాజిల్ బియబాని చేసిన అభివృద్ధి పనులు, ఆయన చేసిన సామాజిక సేవలు నిలిచిపోతాయని ఎమ్మెల్యే అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఎమ్మెల్యే ఆన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మరసుకొల సరస్వతి, జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్, మాజీ సహకార చైర్మన్ కడప హన్ను పటేల్, మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇంతియాజులాల, సర్పంచ్ ల సంఘం మాజీ మండల అధ్యక్షులు మడావి భీమ్రావు, నూతన, పాత సర్పంచ్ లు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
