Utkoor | సీఎం సహాయనిధి పేదలకు వరం

Utkoor | సీఎం సహాయనిధి పేదలకు వరం

Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : సీఎం సహాయ నిధి ఆపదలో ఉన్నవారికి వరం లాంటిదని ఓబులాపూర్ మాజీ సర్పంచ్, కుర్వ ఎల్లప్ప, మాజీ ఉపసర్పంచ్ వెంకటేష్ గౌడ్ అన్నారు. ఇవాళ‌ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఓబ్లాపూర్ లో మంత్రి ఆదేశాల మేరకు శంకరమ్మకు సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ చేశారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… మంత్రి వాకిటి శ్రీహరి పార్టీలకు అతీతంగా చికిత్స పొందుతున్న వారికి సీఎం సహాయంతో ఆస్పత్రి ఖర్చులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేస్తున్నారన్నారు. గ్రామానికి చెందిన శంకరమ్మకు మంజూరైన రూ.22500 చెక్కు అందజేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మాదాసికుర్వ సంఘం తాలూకా అధ్యక్షులు కుర్వఅంజప్ప, నాయకులు జి.రాఘవేంద్రగౌడ్ తిమ్మయ, వెంకటప్ప భీమప్ప, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply