9th Ward | ఎంపీని కలిసిన శ్రీకాంత్ గౌడ్

9th Ward | ఎంపీని కలిసిన శ్రీకాంత్ గౌడ్
9th Ward | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో … బుధవారం జరిగిన ఎన్నికల్లో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 9 వ వార్డు కొండాపురంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుచరుడు, 9వ వార్డ్ అభ్యర్థి బి సు శ్రీకాంత్ గౌడ్ ను బుధవారం ఎంపీ స్వయంగా కలిసి స్థానిక ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అభ్యర్థి శ్రీకాంత్ గౌడ్ ఎంపీకి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానం పలికారు. 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయ డంకా మోగించాలని ఎంపీ ఆశీర్వదించినట్లు తెలిపారు.
