ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా..

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా..

  • 9వ వార్డు అభ్యర్థి చిత్తారి ఎల్లమ్మ

కల్వకుర్తి, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ ఎన్నికల్లో తనను ఓటర్లు ఆశీర్వదించి గెలిపిస్తే వార్డును అన్ని రంగాలలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చిత్తారి ఎల్లమ్మ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఎన్నికల్లో భాగంగా ప్రతిరోజు వార్డులో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తూ మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో అధిక నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జెండా పేద ప్రజలకు అండ అని చిత్తరి ఎల్లమ్మ శ్రీనివాసులు పేర్కొంటున్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేస్తూ ముందుకు సాగుతున్నారు. వార్డు ప్రజలు ఆలోచించి ఈనెల 11న జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని చిత్తారి ఎల్లమ్మ శ్రీనివాసులు ఓటర్లను కోరారు.

Leave a Reply