99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక

99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక

గద్వాల, ఆంధ్రప్రభ: జిల్లాలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ తెలిపారు. అయిదు దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకారం ప్రణాళిక శాఖ ఈ కార్యక్రమానికి నోడల్ శాఖగా వ్యవహరిస్తుందన్నారు. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం,
మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం, మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శాఖల వారీగా 10 వివిధ థీమ్ లతో 99 రోజుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.


1.గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ పైళ్ల క్లియరెన్స్
2.ఆరోగ్యం 3. అరైవ్.. అలైవ్ 4. సంక్షేమం, 5.పిల్లల భద్రత..డ్రగ్స్ కు అడ్డుకట్ట, 6.రైతు సంక్షేమం.. వ్యవసాయం, 7.విద్య, 8.యువత.. క్రీడలు, 9.మహిళలు, 10.పర్యావరణం
మార్చి 6న అన్ని ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించి, 99 రోజుల్లో శాఖల వారీగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించాను ఉన్నట్లు తెలియజేశారు.

Leave a Reply