90 lakhs | ఆయనతో పాటు మరికొందరు…

90 lakhs | ఆయనతో పాటు మరికొందరు…

90 lakhs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ ఇవాళ తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డి కూడా లొంగిపోయారు.

ఈ మేరకు డీజీపీ శివధర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో ప్రకటించారు. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ అలియాస్ కుమ్మ దాదా, సెంట్రల్ కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ బడే చొక్కారావు ఇలియాస్ దామోదర్, స్టేట్ కమిటీ మెంబర్ నూనె నర్సింహా రెడ్డి అలియాస్ గంగన్న అలియాస్ సన్ను దాదా లొంగిపోయారు. వీరిపై ఉన్న మొత్తం 90 లక్షల నగదు రివార్డు డీడీ రూపంలో డీజీపీ అందజేశారు.

90 lakhs |

90 lakhs | మొద‌లైన మావోయిస్టు ఉద్య‌మం…

ఈసందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మొదలైన మావోయిస్టు ఉద్యమం చివరి దశకు వచ్చిందన్నారు. ఈ పరిణామంతో ఆ పార్టీ అత్యున్నత స్థాయి సంస్థాగత నిర్మాణం, తెలంగాణ రాష్ట్ర కమిటీ పూర్తిగా నిర్వీర్యమైపోయిందన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో చేరిపోవాలన్న సీఎం పిలుపు మేరకు ఈ నలుగురు అజ్ఞాతం వీడినట్లు తెలిపారు.

Leave a Reply