90 days | ఘ‌నంగా సావిత్రిబాయి పూలే జయంతి…

90 days | ఘ‌నంగా సావిత్రిబాయి పూలే జయంతి…

90 days | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం(state government) ప్రకటించిన మహిళ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పీఆర్‌టీయూటీఎస్ నారాయణపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాధికారి డాక్టర్ ఎం. గోవిందరాజు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… విద్యారంగంలో మహిళా ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాల(school)ల పరిరక్షణలో మహిళా ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. విద్యార్థుల మానసిక స్థితిని అర్థం చేసుకొని వారిని అన్ని రంగాలలో సుశిక్షితులుగా తీర్చిదిద్దడంలో మహిళా ఉపాధ్యాయులు ముందంజలో ఉన్నారని తెలిపారు.

సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఫూలే దంపతులు సమాజ సంస్కర్తలుగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. పీఆర్‌టీయూటీఎస్ జిల్లా అధ్యక్షులు వై. యాదగిరి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, సంఘంలో మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలిపారు.

మహిళా ఉపాధ్యాయుల కోసం సంఘం ద్వారా ఇప్పటికే ఐదు ప్రత్యేక క్యాజువల్ సెలవులు, 90 రోజుల చైల్డ్ కేర్ లీవులు(90 days of childcare leave) సాధించామని వెల్లడించారు. త్వరలోనే చైల్డ్ కేర్ లీవులను 180 రోజులకు పెంచి, సర్వీస్ మొత్తంలో వినియోగించుకునే విధంగా సంఘం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. మహిళా ఉపాధ్యాయుల ఆశీర్వాదంతో భవిష్యత్తులో అన్ని సమస్యల పరిష్కారానికి సంఘం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాలు వరలక్ష్మి, పట్టణ అధ్యక్షురాలు వాణిశ్రీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనీఫ్, నారాయణపేట పట్టణ ప్రధాన కార్యదర్శి జహీరుద్దీన్, మండల అధ్యక్షుడు ఎం. రఘువీర్, ప్రధాన కార్యదర్శి ఎం. జనార్దన్, దామర్ గిద్ద ప్రధాన కార్యదర్శి రమేష్, ఉట్కూర్ ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి, జిల్లా, రాష్ట్ర బాధ్యులు నర్సింగ్ రావు, నరేష్, అరవింద్ కుమార్, భాగ్యరాజు, ప్రసాద్, సాయిలు, వెంకటప్ప, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహిళా ఉపాధ్యాయ బృందం పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply