ఎస్‌ఎస్‌సి పరీక్షల్లో పేపర్ లీక్ కలకలం..

ఎస్‌ఎస్‌సి పరీక్షల్లో పేపర్ లీక్ కలకలం..

  • 9 మంది ఉపాధ్యాయుల సస్పెన్షన్

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : ఈ నెల 18-03-2026న నిర్వహించిన ఎస్‌ఎస్‌సి పబ్లిక్ పరీక్షలు–2026 సందర్భంగా రెండవ భాష (హిందీ, తెలుగు) ప్రశ్నపత్రాలు పరీక్ష జరుగుతున్న సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు గుర్తించారు. జడ్‌పి హెచ్‌ఎస్ ఆలూరు, జడ్‌పి హెచ్‌ఎస్ మెండోరా, గవర్నమెంట్ కాలేజ్ బోధన్ కేంద్రాల నుంచి ఈ లీకేజీ జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ వ్యవహారాన్ని జిల్లా విద్యాశాఖాధికారి పి. అశోక్ తీవ్రంగా పరిగణించారు.

జిల్లా విద్యాశాఖాధికారి, అదనపు జిల్లా విద్యాశాఖాధికారి, ప్రభుత్వ జూనియర్ కళాశాల బోధన్ సిబ్బందితో కలిసి నిర్వహించిన విచారణలో పర్యవేక్షణలో లోపాలు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో పేపర్ వైరల్‌కు కారణమైన కింది 9 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి పి. అశోక్ ఉత్తర్వులు జారీ చేశారు.

సస్పెండ్ అయిన వారు:
బి. రాజేందర్, ప్రధానోపాధ్యాయుడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, డేగావ్ (అలూరు మండలం)
టి. విజయ్ కుమార్, పాఠశాల సహాయకుడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మాచర్ల (అలూరు మండలం)
పి. ఉమెందర్, సెకండరీ గ్రేడ్ టీచర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మెర్ధపల్లి (అలూరు మండలం)
ఎన్. సాగర్, సెకండరీ గ్రేడ్ టీచర్, మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల, డీకంపల్లి (అలూరు మండలం)
పి. మమత, ప్రధానోపాధ్యాయురాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎస్‌ఆర్‌ఎస్‌పి (మెండోరా మండలం)
జి. రవీందర్, పాఠశాల సహాయకుడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వెల్గటూర్ (మెండోరా మండలం)
చి. బుపతి, పాఠశాల సహాయకుడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎస్‌ఆర్‌ఎస్‌పి (మెండోరా మండలం)
కె. వేణు, పాఠశాల సహాయకుడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెంటకలాన్ (బోధన్ మండలం)
ఎ. శివానందరావు, పాఠశాల సహాయకుడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కల్దుర్కి (బోధన్ మండలం)

పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, విధుల్లో అలక్ష్యం వహించిన వారిపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి పి. అశోక్ హెచ్చరించారు.

Leave a Reply