వైసీపీలో ఆక్రమణ.. టీడీపీతో న్యాయం…

వైసీపీలో ఆక్రమణ.. టీడీపీతో న్యాయం…

రాష్ట్ర డైరెక్టర్ ఎన్.సీ పరమేశ్వర్

రాప్తాడు, ఆంధ్రప్రభ : ప్రతి గ్రామంలోనూ రైతులు ప్రజల బట్టలు ఉతకటానికి రజకులకు దోబీ ఘాట్ భూమిని బ్రిటిష్ కాలంలోనే కేటాయించారు.అయితే కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఆ భూములు పెత్తందార్లు దౌర్జన్యకారులు చేతుల్లోనే ఉన్నాయని ఆ దోబీ ఘాట్ భూములు విడిపించి రజకులకు న్యాయం చేయాలని రాష్ట్ర రజక కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఎన్.సీ పరమేశ్వర్ పేర్కొన్నారు.రాప్తాడు మండలం యర్రగుంట గ్రామంలోని సర్వే నంబర్ 169లో 9-36 సెంట్లు భూమి రజకుల దోబీ ఘాట్ కు తిరిగి ఇవ్వాలని అనంతపురం ఆర్డీవో కేశవ నాయుడు రాప్తాడు తాసిల్దార్ విజయకుమారి కి ఆదేశాలు ఇచ్చారు.

ఆదేశాల కాఫీ పేపర్లను రాప్తాడు మండల తాసిల్దార్ విజయకుమారి రజక సంఘం నాయకులకు అందజేశారు.ఈ సంధర్భంగా రాష్ట్ర రజక సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్.సి పరమేశ్వర్ మాట్లాడుతూ యర్రగుంట గ్రామంలో రెండు తరాలుగా 12 రజక కుటుంబాలు గ్రామంలోని రైతులు ప్రజల బట్టలు ఉతుకుతూ జీవిస్తున్నాయి.కొన్ని సంవత్సరాల క్రితమే గ్రామ పంచాయతీ రజకులు బట్టలు ఉతకడానికి గ్రామంలోని సర్వే నంబర్ 169లో 9-36 సెంట్లు భూమి దోబీ ఘాట్ కు కేటాయించింది.అప్పటినుండి గ్రామంలోని రజకులు బట్టలు అక్కడే ఉతుకుతూ రైతులకు ప్రజలకు సేవ చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటూ జీవిస్తున్నారు.

వైసిపి ప్రభుత్వం హయాంలో మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ (ప్రస్తుతం మాజీ) కేశవరెడ్డికి ఆ దోభీ ఘాట్ భూమి పైన కన్ను పడింది.ఎలాగైనా రజకుల దోబీ ఘాట్ భూమిని సొంతం చేసుకోవాలనే దురుద్దేశంతో కుట్ర పన్ని రిటైర్డ్ అయినా ప్రభుత్వ అధికారులు మండలం నుంచి బదిలీ అయిన ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై ముగ్గురు పేర్లు మీద నకిలీ పట్టాలు నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేయించుకుని ధోబి ఘాట్ ను దౌర్జన్యంగా అక్రమంగా సొంతం చేసుకున్నారు. వైసిపి ప్రభుత్వం హయాంలోనే ఈ నకిలీలు భూమి ఆక్రమణలు జరిగినాయి.

అప్పటి నుండి రజకులు రైతుల బోరు బావులు దగ్గర వంక పక్కన బట్టలు ఉతుకుతున్నారు.అలాగే ధోబి ఘాట్ భూమిని ఆక్రమించుకున్న అక్రమార్కుల పైన న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. మళ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. అప్పుడు రాజకీయ పార్టీల ప్రచారంలో భాగంగా టిడిపి పరిటాల సునీత గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు రజకుల ఐకమత్యంగా తమ సమస్యను చెప్పారు. అందుకు పరిటాల సునీత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చింది.

అందులో భాగంగానే నేడు రజకుల ధోబి ఘాట్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్చించి న్యాయం చేసిందని తెలిపారు.అందుకు రజకులు రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీతకు మండలం ఇన్చార్జి మురళికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే ఆర్టీవో ఇచ్చిన ఆదేశాలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. గ్రామంలో కూడా గ్రామసభ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినప్పుడు గ్రామ రైతులు ప్రజలు కూడా రజకులకు మద్దతిస్తూ అండగా ఉంటామని సంతకాలు కూడా చేశారని తెలిపారు.

రజకుల దోబీ ఘాట్ ఆక్రమించుకుని నకిలీ పట్టాలు నకిలీ పాస్ పుస్తకాలు చేయించుకున్న కేశవరెడ్డి పైన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో రజక చైతన్య సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శిలు పక్కీరప్ప వెంకట రాముడు మండల అధ్యక్షులు కొత్తపల్లి నారాయణస్వామి నాయకులు నాగేంద్ర శివయ్య నరసింహులు క్రిష్టప్ప అశ్వర్థ నాగభూషణ నాగరాజు వన్నప్ప మంగమ్మ కళావతి ఉమాదేవి ముత్యాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply