ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు ఇప్పించడమే నా లక్ష్యం.

కాంగ్రెస్ అభ్యర్థి చాతరబోయిన సత్యనారాయణ -8వ వార్డులో విస్తృత ప్రచారం
స్టేషన్ ఘన్ పూర్, ఫిబ్రవరి 4 ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డ్ లో బుధవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చాతరబోయిన సత్యనారాయణ విస్తృత ప్రచారం నిర్వహించారు. వార్డులోని ఓటర్లను కలుస్తూ వార్డు సమస్యలు తెలుసుకుంటూ సమస్యలను శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ఓటర్లకు కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ వార్డులోని ఓటర్లకు ఎల్లవేళలా సేవలు చేస్తానని సత్యనారాయణ ఓటర్లను కోరారు. వార్డులో గెలిచిన వెంటనే పెంకుటిల్లులు లేకుండా ప్రతి పేద వాడికి పక్కా ఇళ్లు ఇప్పించడమే తన లక్ష్యమని తెలిపారు. కడియం శ్రీహరి, ఎంపీ కావ్య ఆశీస్సులతో గతంలో ఎన్నడూ లేని విధంగా అర్హు లైన పేదలకు అన్ని సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. అభ్యర్థి వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
