ప్రజా సేవే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్నా…!

ప్రజా సేవే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్నా…!
- 8 వ వార్డ్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి
మోత్కూర్, ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ) ప్రజా సేవే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్నామని… మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా గెలిపిస్తే ప్రజాసేవకు అంకితం అవుతామని 8 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించారు . 8 వ వార్డులో సమస్యల పరిష్కారానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సహకారంతో మరిన్ని నిధులు తెచ్చి , వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని హామీ ఇస్తున్నారు .
వార్డులో సీసీ రోడ్లు ,డ్రైనేజీలు, వీధి దీపాలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, పారిశుద్ధ నిర్వాహన ,మౌలిక సదుపాయాల కల్పన కోసం అహర్నిశలు కృషి చేస్తామని, నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా సేవలు అందిస్తామని… తమకు ఈ ఒక్కసారి అవకాశం కల్పించి కౌన్సిలర్ గా గెలిపిస్తే ప్రజలకు రుణపడి ఉంటామని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మన మోత్కూర్ వాట్సాప్ గ్రూప్ లో కీలక సభ్యునిగా పనిచేస్తూ.. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామని అహర్నిశలు నిరుపేదలకు అండగా నిలిచేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని…. ఓటర్లు గమనించి ఈనెల 11న జరిగే ఎన్నికల్లో చెయ్యి గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
