ఆలేరు 8 వ వార్డులో ప్రచారం నిర్వహించిన ఉపేందర్ రెడ్డి

ఆలేరు 8 వ వార్డులో ప్రచారం నిర్వహించిన ఉపేందర్ రెడ్డి
ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 8 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాము అనిత తరఫున టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి శనివారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల మహిళా ప్రతినిధిగా పోటీ చేస్తున్న అనితను ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. నాయకులు మధు తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
