8 years | మార్మోగిన శివాల‌యాలు…

8 years | మార్మోగిన శివాల‌యాలు…

8 years | నందికొట్కూర్, ఆంధ్రప్రభ : ఆలయాల ఖిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో శైవక్షేత్రాల్లో అతి పురాతనమైన ఆలయం నందికొట్కూరు పట్టణంలోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం.ఈ శివాలయానికి దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగి వుండటం విశేషం. గర్భగుడిపై నాగబంధం ఉండటం ఈ ఆలయ విశిష్టత.ఈ ఆలయంలో స్వామివార్లకు జలాభిషేకం చేస్తే శ్రీ కాళహస్తిలో అభిషేకం చేయించినంత పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.

ధనార్జనే పరమావధిగా సాగుతున్న ఈ కాలంలో, సామాన్య భక్తులకు కూడా స్వామివార్ల అభిషేకం జరిపించే విధంగా ఆలయ కమిటీ వారు తమ ఔన్నత్యాన్ని చాటుకోవడం ప్రత్యేకించి కొనియాడబడే విషయం. ఈ ఆలయంలో కార్తీకమాసం, మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. 8 సంవత్సరాల కిందట ఆలయ జీర్ణోద్ధరణ పనులు జరిగాయని, ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే భక్తుల అధిక సంఖ్యలో స్వామి వార్లకు దర్శించుకునేందుకు బారులు తీరారు.పంచాక్షరి మంత్ర జపంతో,శివనామ స్మరణతో ఆలయం మార్మోగింది.

8 years |

లింగోద్భవ కాలంలో స్వామి వార్లకు కల్యాణ మహోత్సవం జరుగుతుండటం ,ఈ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్ల అనుగ్రహానికి పాత్రులు కాగలరని ఆలయ కమిటీ సభ్యులు కేధరప్ప,గంగాధరప్ప తెలిపారు.

8 years |

Leave a Reply