DAY| 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు

Day| తుగ్గలి, ఆంధ్రప్రభ : దేశ పౌరులకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా బుధవారం మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పాఠశాలల్లో భారత రాజ్యాంగ నిర్మాణ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జొన్నగిరి, పెండేకల్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు రమేష్, సుంకన్న లు మాట్లాడుతూ 1949 నవంబర్ 26 వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ తీసుకున్న నిర్ణయంతో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా గుర్తింపు వచ్చింది అన్నారు. 1947 ఆగస్టు 15 న భారతదేశనికి స్వాతంత్రం వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని రచించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలను క్షుణ్ణంగా చదివి, మన దేశంలోని సాంస్కృతిక, భాషల, తదితర వైవిధ్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నామని తెలిపారు.

Leave a Reply