75 years | మోడీ తర్వాత…
75 years | స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, మోడీ తర్వాత ఎవరన్న ప్రశ్నకు సమా ధాన మివ్వాల్సింది బీజేపీ లేదా స్వయంగా మోడీయేనని అన్నారు. మోడీ తర్వాత ఎవరు అన్న ప్రశ్నకు నిర్ణయాన్ని బీజేపీ తీసుకుంటుందని అన్నారు. ఆయన ప్రకటన పత్రికా వర్గాల్లో తుపాను సృష్టించింది. ఆర్ఎస్ఎస్ అధి నేత అలా ఎందుకన్నారు? అన్న ప్రశ్నలు తలెత్తాయి. మోడీకి ఇప్పుడు 75 ఏళ్ళు. (ఆయన 1950లో జన్మించారు.

చరిత్రగతంగా చూస్తే, ప్రపంచ వ్యాప్తంగా బలమైన, లేక ఎక్కువ కాలం అధికారంలో ఉన్న నాయకుని వారసు డు ఎవరు? అనే ప్రశ్న తరచూ తలెత్తుతూ ఉంటుంది. 1932లో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఇదే ప్రశ్న తలెత్తింది.
ఆయన 1944లో నాల్గవ సారి అమెరికా అధ్యక్షుడు అయ్యారు. ఆయన చక్రాల కుర్చీలో కూర్చుని పరిపాలన సాగించినప్పటికీ అమెరిక న్లు ఆయననే నాలుగు సార్లు ఎన్నుకున్నారు. అలాగే, స్పెయిన్ని ఫ్రాన్సిస్కో ఫ్రాంకో 1939 నుంచి 1975 వర కూ పరిపాలన సాగించారు. ఆయన తర్వాత ఎవరనే…..

