70 percent | ముగిసిన ఎన్నికలు…. కాసేపట్లో కౌంటింగ్
70 percent | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : పంచాయతీ తుది దశ ఎన్నికల పోలింగ్(Election polling) ముగిసింది. ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటలకు ముగిసింది. కొన్ని గ్రామాల్లో ఇంకా క్యూలో ఉన్నవారికి ఓటింగ్ వేసే అవకాశాన్ని కల్పించారు. పోలింగ్ పూర్తయిన కేంద్రాల్లో రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తారు. మూడో దశకు సంబంధించి 3,752 సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరిగాయి. అలాగే 28,106 వార్డులకు పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 70 శాతాని(70 percent)కి పైగా పోలింగ్ నమోదైందని సమాచారం.
70 percent | పలుచోట్ల ఘర్షణలు, నిరసనలు..
పోలింగ్ సందర్భంగా ఈ రోజు పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటు అడుగుతున్నారని ఇరువర్గాల మధ్య మొదలైన గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు, వారి వర్గీయులు పరస్పరం దాడులకు దిగారు. సర్పంచ్ అభ్యర్థి బోయిని రాములుకు గాయాలయ్యాయి.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో ఓ పోలింగ్ స్టేషన్(polling station) వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. వెంటనే పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఖమ్మం జిల్లా కొత్త మేడేపల్లి వాసులు పోలింగ్‌ను బహిష్కరించి నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఓ సర్పంచ్ అభ్యర్థి వద్ద రూ. 28,500లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
70 percent |ముగిసిన పోలింగ్… 77.58శాతం నమోదు …
ఆంధ్రప్రభ ప్రతినిధి, వరంగల్ : మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికలు వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నెక్కొండ మండలాలలో జరిగింది. చెన్నరావుపేట మండలంలో 31351 ఓట్లకు గాను 26206 ఓట్లు పోలవగా 83.59 శాతం పోలింగ్ నమోదయింది. ఖానాపురం మండలంలో 27139 ఓట్లకు గాను 19091 ఓట్లు పోలవగా 70.35శాతం పోలింగ్ నమోదైంది.నర్సంపేట మండలంలో 22472 ఓట్లకు గాను 18462ఓట్లు పోలవగా 82.16 శాతం పోలింగ్ నమోదయింది.

నెక్కొండ మండలంలో 43593 ఓట్లకు గాను 32870ఓట్లు పోలవగా 75.4శాతం పోలింగ్ నమోదు అయింది. మొత్తంగా జిల్లాలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలు ఒంటిగంట వరకు 77. 58 శాతం పోలింగ్ నమోదయింది ఓటర్లు ఇంకా క్యూ లైన్ లలో ఉన్నారు. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

