70 lakh people | 45 రోజుల్లో 9 వేల కోట్లు…

70 lakh people | 45 రోజుల్లో 9 వేల కోట్లు…
70 lakh people | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సిద్దిపేట జిల్లా నర్మేటలో సీఎం రేవంత్ రైతు భరోసా నిధులు విడుదల చేశారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు సీఎం. రైతును రాజు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, రైతుల పథకాలని అమలు చేస్తున్నామని తెలిపారు.
పంటలకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ కూడా ఇస్తున్నామని వెల్లడించారు. 70 లక్షల మందికి రైతు భరోసా నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. 45 రోజుల్లో రూ, 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు.
సిద్దిపేట జిల్లా సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతినెలా రైతుల కోసం రూ. 2535 కోట్లు ఖర్చు చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతినెల రూ. 5535 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రైతుల కోసం రూ.1.30వేల కోట్లు ఖర్చు చేస్తున్నమని ప్రకటించారు. నేను ఏ నియోజకవర్గంపై ఈ వివక్ష చూపించను వివక్ష ఉంటే ఈ ఫ్యాక్టరీని కొడంగల్ కు తరలించే వానీ కానీ అలా చేయలేదని అన్నారు.
119 నియోజకవర్గాన్ని సమానంగా చూస్తామన్నారు. ఎన్నికలున్నప్పుడే రాజకీయాలు తర్వాత అభివృద్ధికి అంకితం అవుదామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ సమస్యలు తీసుకువచ్చిన పరిష్కరిస్తామని వెల్లడించారు. KTR, KCR, హరీష్ రావుతో భిన్నాప్రాయాలు ఉండవచ్చు కానీ ఆ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం కూడా పనిచేస్తానని తెలిపారు. కానీ బీఆర్ఎస్ వివిక్షత చూపిస్తుంది. 2014 నుంచి 2023 మధ్య కొడంగల్ కు ఎన్ని నిధులు ఇచ్చారని ప్రశ్నించారు.
అభివృద్ధికి అడ్డం పడుకుంటే ఆగుతామా సీఎంగా సిద్దిపేటకు రాలేదా అన్నారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేని గెలిపించండి మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
ప్రతి పంట సాగులో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. రూ. 750 కోట్లతో నిర్మించిన ఫామ్ యిల్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ పండించిన ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. పంట మార్పుడికి రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. పంట మార్పిడితో రైతులకు మంచి ధర వచ్చేలా కేంద్రంతో మాట్లాడతామని అన్నారు.
మిల్లెట్స్ ఆకుకూరలు ఫామ్ యిల్ సాగుపై రైతులు దృష్టి పెట్టాలని, ఫామ్ యిల్ సాగు లాభసాటి వ్యవసాయం.. రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు. ప్రతి పంచాయతీ అంకాపూర్ అభివృద్ధి చెందాలి. ప్రతి రైతు కారు కొనుక్కునేలా ఆదాయం పెంచుకోవాలని పేర్కొన్నారు. అలాగే కొడంగల్ లోను ఫామ్ యిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పాండే ప్రతి గింజ బంగారు తెలంగాణలో భాగస్వామ్యం చేస్తుందని వెల్లడించారు. ఆర్గానిక్ ఫుడ్స్ మిల్లెట్స్ కి ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు.
తెలంగాణలో మహిళకు పెద్దపీట వేస్తుందని సీఎం తెలిపారు. అందుకే మహిళల పేరుతోనే అన్ని సంక్షేమ పథకాలు అముల చేస్తున్నామని తెలిపారు. 2034 కి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామన్నారు. పిల్లలను ప్రైవేటు స్కూల్లో చదివించాలని మోనుకొవాలి, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాలు, రాగి జావ, పౌష్టికాహారం అందిస్తున్నాం. సాంకేతిక నైపుణ్యం ఉన్న విద్యావైపు విద్యార్థులు మారాలన్నారు. ATC లో చదువుకుంటున్న విద్యార్థులకు రూ. 2 వేల స్టైఫండ్ ఇస్తున్నాం, ప్రతిభ ఉంటే ప్రపంచం మీకు తలవంచుతుందన్నారు.
