జీఎస్టీ సవరణలతో రాష్ట్రానికి ఏడు వేల కోట్లు నష్టం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ(GST) సంస్కరణలపై (GST Reforms) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కేంద్రం జీఎస్టీని సవరించడంతో రాష్ట్రానికి దాదాపు రూ.7 వేల కోట్లు ఆదాయం తగ్గిందనీ, రాష్ట్రానికి జరిగే ఈ నష్టాన్నికేంద్రమే పూడ్చాలని డిమాండ్(demand) చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రాష్ట్రాలపై భారం వేయడం సరికాదని, వచ్చే ఐదేళ్లపాటు కేంద్రం వయబులిటీ గ్యాప్ ఫండ్(Viability Gap Fund) ఇవ్వాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వస్తున్నఆదాయం ప్రకారం రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకున్నామనీ, ఇప్పుడు ఈ నిర్ణయంతో నష్టం జరుగుతోందని చెప్పారు.
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) రాష్ట్రానికి ఏర్పడే నష్టంపై నివేదిక కూడా ఇచ్చారని వెల్లడించారు. జీఎస్టీ చట్టం తెచ్చిన సమయంలో 14 శాతం ఆదాయం తగ్గిన రాష్ట్రాలకు వయబులిటీ గ్యాప్ ఫండ్ (viability gap fund) ఎలా ఇచ్చారో, ఇప్పుడు కూడా అలాగే వీజీఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి వస్తున్ననష్టంపై డిప్యూటీ సీఎం రాస్తారనీ, దాన్నికిషన్ రెడ్డి (Kishan Reddy) కేంద్రం వద్దకు తీసుకువెళ్లి నష్టాన్నిభర్తీ చేయించాలని డిమాండ్ చేశారు.