ఎస్ బిఐ ముందు బాధితుల ఆందోళన

ఎస్ బిఐ ముందు బాధితుల ఆందోళన

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్ బిఐ రెండవ బ్రాంచ్ ముందు బాధిత ఖాతదారులు ఆందోళన చేపట్టారు. గత కొద్దీ నెలల క్రితం చెన్నూర్ రెండవ బ్రాంచ్ లోని ఖాతాదారులు దాచుకొన్న కోట్లాది నగదుతో పాటు బంగారు అభరణాలు సంబంధిత శాఖ అధికారులు హైటెక్ చోరికి పాల్పడిన విషయం విదితమే.

అచోరిలో స్థానిక పోలీసులు వేగవతంగా విచారణ చేసి కొద్దిరోజులోనే తమదైనా స్టైలో నగదు, బంగారాన్ని రికవరీ చేసి కోర్టు కు అప్పగించారు. కోర్టునుంచి రికవరీ అయిన బంగారం 7 నెలలు గడుస్తున్న బ్యాంక్ అధికారులు బాధితులకు అందజేయలేదు. బ్యాంక్ అధికారులు చేస్తున్న జాప్యం కారణంగా మేము ఆర్థికంగా నష్టపోవడం జరిగిందని బ్యాంక్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు.

Leave a Reply