6,020 people | చిన్నారులకు రిస్ట్ బ్యాండ్

6,020 people | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు వచ్చి తప్పిపోయే చిన్నారుల ఆచూకీ కోసం పోలీసులు రూపొందించిన చైల్డ్ ట్రాకింగ్ రిస్ట్ బ్యాండ్లపై భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటి వరంగల్ కమిషనరేట్ పరిధిలో 6,020 ట్రాకింగ్ రిస్ట్ బ్యాండ్లను చిన్నారులకు అమర్చారు. ఇందులో హనుమకొండ బస్టాండ్ లో 4,070 రిస్ట్ బ్యాండ్లు అమర్చగా, వరంగల్ బస్టాండ్ పరిధిలో 1,950 రిస్ట్ బ్యాండ్లను అమర్చినట్లు పోలీసులు వెల్లడించారు.

Leave a Reply