6 zones | రోడ్డు విస్తరణ పనులు వేగవంతం

6 zones | రోడ్డు విస్తరణ పనులు వేగవంతం

6 zones | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు చేపట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగిస్తూ, రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేస్తోంది.

నగరంలోని 6 జోన్లలో ఫుట్‌పాత్‌ను ఆక్రమించి నిర్మించిన షెడ్లు, ఇతర నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. ముఖ్యంగా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఆరాంఘర్ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో రహదారి పక్కన ఏర్పాటు చేసిన చిరు వ్యాపారుల డబ్బాలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ చర్యలపై స్థానిక వ్యాపారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

అధికారులు, పోలీసులు సమన్వయంతో పరిస్థితిని నియంత్రిస్తూ తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాంబాగ్ ప్రాంతంలో జరుగుతున్న ఆక్రమణల తొలగింపు చర్యలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ స్వయంగా పరిశీలించారు.

Leave a Reply