అభివృద్ధి కోసం అమ్మను గెలిపించండి

భీమ్గల్ టౌన్, ఫిబ్రవరి 4 ( ఆంధ్రప్రభ )ఐదో వార్డు కౌన్సిలర్ గా కొండ గోదావరి ప్రకాష్ గౌడ్ ను గెలిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి కోరారు. బుధవారం పట్టణంలోని ఐదో వార్డు లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వార్డు లోని వివిధ కుల సంఘాలు, మహిళా సంఘాల సభ్యులతో సమావేశం అయ్యారు. ఆడబిడ్డ గా రాజకీయ అనుభవం కలిగిన అభ్యర్థి కి ఓటు వేయడం ద్వారా అభివృద్ధి మరింత అవుతుందని అన్నారు. రాజకీయం లో సంపాదన కోసం వచ్చే వారు కావాలా, నిజాయితీ గా పాలన చేసే వారు కావాలో ప్రజలు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. డబ్బులకు, మద్యానికి ఓటు ను అమ్ముకోకుండా నిజాయితీ పాలన అందించే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఐదో వార్డు ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని, అవకాశం అందించాలని బీజేపీ అభ్యర్థి కొండ గోదావరి కోరారు. ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
