5Secrets | థైరాయిడ్ తగ్గించుకోవచ్చు..

5Secrets | థైరాయిడ్ తగ్గించుకోవచ్చు..
5Secrets | ఆంధ్రప్రభ వెబ్ ఫీచర్స్ డెస్క్ : ఆంధ్రప్రభ వెబ్ ఫీచర్స్ డెస్క్ : థైరాయిడ్….మగ-ఆడ తేడా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య…దీనికి క్రమంతప్పకుండా వైద్యులు సూచించే మందులువాడడం తప్ప మరో గత్యంతరం లేదు. కానీ, ఒక్కోసారి క్రమం తప్పకుండా మందులు వాడకుంటున్నా, థైరాయిడ్ లెవెల్స్ హెచ్చుతగ్గులు అయోమయానికి గురిచేస్తాయి.
అయితే, మందులొక్కటే థైరాయిడ్ కంట్రోల్ లో ఉండడానికి పరిష్కారం కాదు. ఇదొక అసామతుల్యత కాబట్టి, సమతుల్యత కోసం అనేక చిట్కాలు పాటించి ప్రయత్నించవచ్చు.
అవి కూడా తేలికగా లభించే వంటింటి వస్తువులతో తేలికగా తయారు చేసుకునేవి.
అవేమిటో చూద్దామా.
1) రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా మిరియాల నూనెలో కలిపి తాగండి. ఇది థైరాయిడ్ హార్మోన్లను సమతుల్యం చేసి, జీవక్రియను పెంచుతుంది. ఇది సాధారణ చిట్కా కాదు, మిరియాల యాంటీ-ఇన్ఫ్లమేటరీ శక్తితో గ్రంథిని శుద్ధి చేస్తుంది.
2) రెండు చెంచాల ధనియాలు, గుప్పెడు పుదీనా ఆకులు ఒక గ్లాసు నీటిలో 8 గంటలు నానబెట్టి, వేయించి ఉదయమే తాగితే థైరాయిడ్ వాపును తగ్గించి, థైరాయిడ్ గ్రంధిని బలోపేతం చేస్తుంది.ఇలా రెగ్యులర్ గా తాగడం వల్ల 15 రోజుల్లో మార్పు కనిపిస్తుంది.
3) చిన్న అల్లం ముక్క, చిటికెడు పసుపు, ఒక చెంచా తేనె కలిపి ఉడికించి ఉదయమే తాగండి. ఈ ప్రత్యేక మిశ్రమం థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపూరితం చేస్తుంది..శరీరం బరువును నియంత్రిస్తుంది. .

4) కొత్తిమీర, కలబంద కలిపి రసం చేసుకుని, దానికి జీలకర్ర కలిపి ఉదయమే తాగడం వల్ల టీ ఎస్ హెచ్ లెవల్స్‌ను క్రమంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా మహిళలకు బాగా పనిచేస్తుంది ఈ మిశ్రమం
5) ప్రతి రోజు సర్వాంగాసన 5 నిమిషాలు చేసి, కొబ్బరి నూనె గొంతుకు మసాజ్ చేయడం వల్ల థైరాయిడ్‌ను మూలాల నుంచి క్రమబద్ధం చేస్తుంది, శక్తి పుంజుకొన్న అనుభూతి కలుగుతుంది.
గమనిక. ఈ వ్యాసం కేవలం పాఠకుల ప్రాధమిక అవగాహన కొరకు మాత్రమే అందించబడింది. వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స ఆవశ్యము.
