5G PHONES | స్మార్ట్‌గా సేవలు..
- మెరుగైన సేవల కోసం స్మార్ట్ ఫోన్ల పంపిణీ
- ఎమ్మెల్యే బోడే ప్రసాద్
5G PHONES | పెనమలూరు, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో శిశు సంక్షేమ సంరక్షణ శాఖలో సాంకేతికత ద్వారా మెరుగైన సేవలు అందించడానికి స్మార్ట్ ఫోన్లను (Smart Phones) పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకి ఎమ్మెల్యే కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు 5జీ స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే అందించారు. శిశు సంక్షేమం, గర్భిణుల పౌష్టికాహారం మొదలైన అంశాల గురించి సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు.

