ఎండ తీవ్రతకై జాగ్రత్తలు తీసుకోవాలి….

ఎండ తీవ్రతకై జాగ్రత్తలు తీసుకోవాలి….

పాయకాపురం, ఆంధ్రప్రభ : ఎండాకాలం అంటేనే ఎండలు, వడగాల్పులు తీవ్రంగా ఉంటాయి. వాటి తీవ్రతకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనయుడు సిద్దార్ధ అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ సాయిబాబా గుడి సెంటర్ వద్ద ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు సూచన మేరకు వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టీడీపీ యువ నాయకుడు బొండా సిద్దార్ధ ఘనంగా ప్రారంభించారు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్త సుల్తానా, ఈశ్వర్ కుమార్తె హనిశ్రీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈసేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం ద్వారా పాఠశాల విద్యార్థులు, వాహనదారులకు, స్థానిక ప్రజలకు చల్లని మజ్జిగను ఆయన పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పిరియ జగదాంబ, డివిజన్ అధ్యక్షుడు కూర్మాపు దుర్గారావు, ప్రధాన కార్యదర్శి మల్లంపాటి రవికుమార్, ఇంచార్జ్  పిరియ సోమేశ్వరరావు, క్లస్టర్ ఇంఛార్జి సుర్విపల్లి అమర్నాధ్ గౌడ్, చిట్టితల్లి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply