583 votes | అధికార పార్టీకి 10 సర్పంచ్, బీజేపీ 8 స్థానాలు కైవసం.

583 votes | అధికార పార్టీకి 10 సర్పంచ్, బీజేపీ 8 స్థానాలు కైవసం.

583 votes | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో తుది విడత సర్పంచ్ ఎన్నికలు(Elections) హోరాహోరీగా రసవత్తరంగా కొనసాగింది. అధికార కాంగ్రెస్ పార్టీ బిజెపి మధ్య తీవ్ర పోటీ నెలకొనగా కాంగ్రెస్ పార్టీ పది సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోగా, బిజెపి 8 స్థానాలను విజయం సాధించగా బీఆర్ ఎస్ ఒకే సర్పంచ్ స్థానంతో సరిపెట్టుకుంది. ఓబులాపూర్ సర్పంచ్ స్థానం మిత్రపక్షాల అభ్యర్థి సత్యనారాయణ రెడ్డి విజయం సాధించారు.

ఊట్కూర్ పట్టణ సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాలతో పాటు 10 వార్డు స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. ఊట్కూర్ సర్పంచ్ గా ఎం. రేణుక భరత్ కాంగ్రెస్ అభ్యర్థి సుజాత పై 583ఓట్ల(583 votes) మెజార్టీతో విజయదుందుభి మోగించారు. సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ రమేష్ నువార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బిజెపి నాయకులు వార్డు సభ్యులను ముందుగా ఎంపిక చేయడంలో సఫలీకృతం కావడంతో ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు బలమైన వార్డు సభ్యులను ఎన్నికల బరిలో నిలపకపోవడంతో ఓటమి ఎదురైనట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగిన ఎన్నికల ఫలితాలు బుధవారం అర్ధరాత్రి వెలబడడంతో బిజెపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఊట్కూర్ మండలంలో బిజెపిపార్టీస్థానిక సంస్థల ఎన్నికల్లో పుంజుకుంది.

Leave a Reply