55th appearance | ఘనంగా 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

55th appearance | ఘనంగా 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

55th appearance | కరీమాబాద్, ఆంధ్రప్రభ : పి ఆర్ టి యు టి ఎస్ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం పిఆర్టి యు భవన్లో వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఈదునూరి రవీందర్ రెడ్డి,హన్మకొండ జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి పి ఆర్ టి యు వ్యవస్థాపకుడు సామల యాదగిరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు ఘటించారు.

అనంతరం పిఆర్టియుపతాకాన్ని వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఈదునూరి రవీందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హనంకొండ వరంగల్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ పంచాయితీ రాజ్ ఉపాధ్యాయుల ఆత్మగౌరవ సాధనకై తొలి అడుగు వేసిన రోజు. ఫిబ్రవరి 9 అని అన్నారు. పి ఆర్ టి యు యూనియన్ (పంచాయితీ రాజ్ టీచర్స్ యూనియన్)స్వర్గీయ శ్యామల యాదగిరి స్థాపించి నేటికి 52 సంవత్సరాలు పూర్తి అయిందని వారు అన్నారు.

నేరుగా జీతం కూడా పొందలేని పరిస్థితి నుండి.సకల సౌకర్యాలు పొందేలా.పంచాయితీ రాజ్ ఉపాధ్యాయుల జీవితాలలో వెలుగులు నింపడానికి పడ్డ తొలి అడుగు అని పి ఆర్ టి యు వ్యవస్థాపకుడు సామల యాదగిరి జన్మదినోత్సవాన్ని పి ఆర్ టి యు ఆవిర్భా దినోత్సవం గా నిర్వహించుకుంటున్నామని వారు తెలిపారు. పంచాయితీ రాజ్ ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన రోజు అని అన్నారు.

ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఉపాధ్యాయులను,రిటైర్డ్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ఉపాధ్యాయులు భారీగా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

Leave a Reply