500 petitions | సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌

500 petitions | సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌

  • మైలవరం ఎమ్మెల్యే వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్‌

500 petitions |విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : ప్ర‌జ‌ల కష్టాలు తీర్చడంతో పాటు ప్రజాసమస్యల సత్వర పరిష్కారమే(solution) లక్ష్యంగా ప్రతివారం క్రమం తప్పకుండా ‘ప్రజాదర్బారు’ను నిర్వహిస్తున్నామని మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాదు వెల్లడించారు.

విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో గ్రామ పంచాయితీ కార్యాలయంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) కార్య‌క్ర‌మాన్ని ఈ రోజు నిర్వహించారు. దాదాపు 500 మంది అర్జీలు(500 petitions) సమర్పించారు. స్థానిక ఎమ్మెల్యే స్వయంగా ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించి, వాటి త‌క్ష‌ణ ప‌రిష్కారానికి అధికారుల‌కు అక్క‌డిక‌క్క‌డే ఆదేశాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు వ్యయప్రయాసలకోర్చి నిత్యం కార్యాలయాల చుట్టూ తిరగకుండా నియోజకవర్గ స్థాయితో పాటు ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో తమ సమస్యలు తెలియజేసే అవకాశాన్ని పీజీఆర్ఎస్(PGRS) కార్య‌క్ర‌మాలు క‌ల్పిస్తున్నాయ‌న్నారు. ఇందులో జిల్లా అధికారులను సైతం భాగస్వామ్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటికే రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు మండలాల్లో ప్రజాదర్బారు కార్యక్రమాలను నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం లభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్య‌క్ర‌మంలో మైలవరం నియోజకవర్గ జనసేన(constituency Janasena) పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి నూతులపాటి బాలకోటేశ్వరరావు (బాల), స్థానిక నాయకులు, వివిధ శాఖ‌ల అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply