ర‌హ‌దారుల‌కు 500కోట్ల నిధులు మంజూరు

ర‌హ‌దారుల‌కు 500కోట్ల నిధులు మంజూరు

దేవరకొండ, ఆంధ్రప్రభ : అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రతి పనిని పూర్తి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. ఈ రోజు మార్కెట్ కార్యాలయంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న బిటీ, సీసీ రోడ్ల నిర్మాణాలకు సుమారు 469 కోట్ల నిధులను మంజూరైనట్లు బాలు నాయక్ చెప్పారు. గిరిజన శాఖ, హోమ్ నిధులు మంజూరైనట్లు ఆయన చెప్పారు. గిరిజన శాఖ మంత్రి లక్ష్మణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో అంతర్గత రోడ్లు, కాజ్వేలు నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. గత ప్రభుత్వంలో వెనుకబడిన దేవరకొండను ఈనాడు పట్టించుకోని పాలకులు నేడు అనవసరమైన ఆరోపణలు చేయడం వారికి తగదని హితవు పలికారు. సంవత్సరన్నర కాలంలో సుమారు ఒక్క రహదారికే 500 కోట్ల నిధులు తెచ్చి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి కొన్ని పనులు కూడా కొనసాగుతున్నట్లు ఆయన చెప్పారు. అధికారం చేపట్టిన సంవత్సరంలోనే మొదటి సమావేశం ఏర్పాటు చేసి ఎస్ఎల్బీసీకి 1800 కోట్ల నిధులను మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని బాలు నాయక్ అన్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ముఖ్యమంత్రి పాలమూరు రంగారెడ్డి లో అంతర్భాగమైన డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తిచేసే దిశగా ముందుకెళుతున్నట్లు ఆయన చెప్పారు. డిండి ప్రాజెక్టుకు ఎదురుల రిజర్వాయర్ నుండే నీరు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని బాలు నాయక్ చెప్పారు. త్వరలోనే ఎస్ఎల్బీసీ పనులు కూడా చేపట్టి మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని బాలు నాయక్ చెప్పారు.

గత ప్రభుత్వం 15 సంవత్సరాల‌ కాలంలో పెళ్లిపాకుల రిజర్వాయర్ని పట్టించుకున్న పాపాన పోలేదని ఎమ్మెల్యే చెప్పారు. పెళ్లిపాకుల ప్రాజెక్టు అంచనా పెరిగిన ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా 600 కోట్లతో టెండర్లు పూర్తిచేసుకుని త్వరలోనే పనులు కూడా చేపట్టనున్నట్లు బాలు నాయక్ అన్నారు. ప్రధాన రహదారులైన దేవరకొండ నుండి డిండి, కొండమల్లేపల్లి నుండి ధర్వేశిపురం వరకు పనులు పూర్తి చేసే దిశగా కొనసాగుతుందని ఆయన చెప్పారు.

ఎఎంఆర్పి ప్రాజెక్టు ద్వారా వెళ్లే నీటి కాలువల్లో చెట్లను కూడా తీసివేయలేని గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం 350 కోట్ల నిధులు ఇచ్చి పనులు చేపట్టేలా టెండర్ ప్రక్రియ పూర్తి చేసిందని ఎమ్మెల్యే అన్నారు. హమ్ పథకం ద్వారా పంచాయతీరాజ్ శాఖ నుండి మరో 105 కోట్ల నిధులు మంజూరు కానున్నట్లు బాలు నాయక్ చెప్పారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీలు నల్లగా జాన్ యాదవ్, ముత్యాల సర్వయ్య, బిక్కు నాయక్, మాజీ మార్కెట్ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్, ఏడుపుల గోవిందు యాదవ్, ముచ్చర్ల గిరి, నాగభూషణ, కొర్ర రామ్ సింగ్,మాజీ సర్పంచ్ శివ, యూను స్ తదితరులున్నారు.

Leave a Reply