పాఠశాల అభివృద్ధికి 5 లక్షలు విరాళం..

పాఠశాల అభివృద్ధికి 5 లక్షలు విరాళం..

గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తేరటుపల్లి మాజీ సర్పంచ్ వీరమల్ల శ్రీశైలం రూ.5 లక్షల రూపాయలు పాఠశాల సమితి అధ్యక్షులు యిడం శ్రీనివాస్ కు అందజేశారు. మండల కేంద్రానికి చెందిన 10 మంది నిరుపేద మహిళలకు నాప డైరెక్టర్స్ చిప్ప ప్రభాకర్, యిడం శ్రీనివాస్ కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థి, విద్యార్థినిలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆలరించాయి.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ నామని జగన్నాథం, ఎన్వికె విశ్వేశ్వరరావు, గోలి గురునాథం, బొడిగ వెంకటేష్, దోర్నాల అంజయ్య, సురేందర్ రెడ్డి, బావండ్ల వినయ్ కుమార్, రాపోలు రవీందర్, గాజుల అనిల్, భావండ్ల శ్రీనివాస్, గంజి రాములు, గంజి శంకర్, కొంగరి నరహరి, కర్నాటి శ్రీనివాస్, చెరుపల్లి శ్యాంప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply