5 counters | సమస్యల పరిష్కారానికి..
- కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్‌ల ఏర్పాటు
5 counters | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : జిల్లాలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్(Revenue Clinic)లు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్‌లను ప్రారంభించి ప్రక్రియను పరిశీలించారు.
కలెక్టరేట్‌లో 5 కౌంటర్లు(5 counters) ఏర్పాటు చేశారు. అందులో దరఖాస్తుల పరిశీలన, సలహా సూచనల విభాగం, 22-ఏ సమస్యలు, భూసేకరణ సంబంధిత సమస్యలు, ఆర్ఓఆర్ పట్టాదారు పాసుపుస్తకాలు, సుమోటో అడంగల్ కరెక్షన్ సంబంధిత సమస్యలు, రీ సర్వే, విస్తీర్ణం తేడా, జాయింట్ ల్యాండ్ పార్సల్ మ్యాప్(land parcel map) (ఎల్పిఎం) సంబంధిత సమస్యలు, ఇతర రెవెన్యూ సమస్యల విభాగాలున్నాయి.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో ఎక్కువగా భూ సమస్యలు(problems) ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు ఈ క్లినిక్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, డీఆర్ఓ కె.చంద్రశేఖర రావు, కెఆర్ ఆర్‌సీఎస్‌డీసీ శ్రీదేవి, డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, పలువురు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

