4th day | ఘనంగా స్వామివారి రథోత్సవం, వసంతోత్సవ చక్రస్నానం

4th day | ఘనంగా స్వామివారి రథోత్సవం, వసంతోత్సవ చక్రస్నానం

4th day | గంపలగూడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మండలంలోని నెమలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు టి.గోపాలాచార్యులు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసారు. ఉత్సవమూర్తులను ప్రత్యేక రథంపై నెలకొల్పి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు.

అనంతరం సుదర్శన చక్రానికి చక్రస్నానం నిర్వహించారు. అనంతరం కోనేరులో తెప్పోత్సవం నిర్వహించగా ఆ కార్యక్రమం భక్తులను కనువిందు చేసింది. కార్యక్రమంలో ఆలయ ఈవో నేల సంధ్య, చైర్మన్ కావూరి శశిరేఖ, ఆలయ మాజీ అధ్యక్షులు బెల్లం మధుసూదన్ రావు, వడ్లమూడి రాజశేఖర్, మాజీ సభ్యుడు వనమా చిన్న అనంత రామయ్య, తదితరులు పాల్గొన్నారు.

4th day |

నేడు పవళింపు సేవ..

బ్రహ్మోత్సవాల ముగింపు రోజైన గురువారం పవళింపు సేవ జరుగుతుంది. ఉదయం ఆరు గంటలకు స్వామివారు, అమ్మవార్లకు అభిషేకము, తదుపరి ద్వాదశ ప్రదక్షణములు, పర్యంకాసనోత్సవం జరగుతుంది.

4th day |

Leave a Reply