రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలి…

రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలి…
చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజక వర్గం 48వ డివిజన్ చిట్టినగర్ ఈద్గా మహల్ ప్రాంగణంలో అమ్మ సేవ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఆర్ మాధవ్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లిం కుటుంబాల వారికి రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ రంజాన్ తోఫా కిట్లు పేద ముస్లిం మహిళలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాధ్ మాట్లాడుతు రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్ర మాసం అన్నారు. రంజాన్ మాసంలో పేద ముస్లిం కుటుంబాలు సైతం సంతోషంగా పండగ జరుపుకునేందుకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చిన ట్రస్ట్ నిర్వాహకుడు మాధవ్ ను ఎంపీ అభినందించారు. విజయవాడ నగరం లో రంజాన్, క్రిస్మస్, దసరా ఏ పండుగ నైనా అన్ని కులాల వారు కులమతాలకు అతీతంగా జరుపుకుంటారని అన్నారు.
ఇదే విజయవాడ విశిష్టత అన్నారు. ఇటువంటి విజయవాడ నగరంలో జన్మించటం, పార్లమెంటు సభ్యులు కావటం తనకెంతో గర్వంగా ఉందని శివనాధ్ అన్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎండి ఫతవుల్లా, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పి.మాధవ, జోగేష్ డైరెక్టర్ రాము, షాదీ ఖానా కార్యదర్శి అక్బర్ ఖాన్, నాయకులు పటాన్ రషీద్ ఖాన్ , పఠాన్ అక్బర్ ఖాన్, షేక్ కాజా , షేక్ సుభాని , షేక్ నూర్మి, పిళ్ళా వంశీతారక్, తమ్మిన నరేష్, గిరీష్, నాగోతి వెంకటేష్,
కంభంపాటి నాగేంద్రబాబు, కె.అశోక్, కె ప్రదీప్,వినుకొండ చంటి,దాసరి నాగమణి ,ఈ వెంకట రమణమ్మ ,వాణి , తదితరులు పాల్గొన్నారు.
