ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది

మంచిర్యాల, ఆంధ్రప్రభ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 47వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి బొల్లం భీమయ్యను గెలిపించండి అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ నారాయణ శ్రీ గణేష్ ఆదివారం మంచిర్యాల పట్టణంలో ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లు నిద్రపోయినటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల అనంతరం ఎన్నికల సందర్భంగా మేము అభివృద్ధి చేసినాము అంటూ మోసపూరిత ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చి కుటుంబ పరిపాలన సాగించిన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సరైన గుణపాఠం నేర్పించారని ఇప్పటికైనా చేసిన తప్పిదాలను సరిచూసుకోవాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా అనేక సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు, అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా అమలు చేస్తుండడం గత నెలలు జరిగిన స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు శాతం మంది విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలనను తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మంచిర్యాలలో 60 సీట్లను కైవసం చేసుకుంటుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులే విజయానికి నాంది అని అన్నారు.ఈ ప్రచారంలో మాజీ కౌన్సిలర్ లు జగ్గరి సంజీవ్,కాసార్ల శ్రీనివాస్, రామగిరి బాణేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి ఖజమియా,వడ్నాల శ్యామ్ సుందర్,గొంగల శంకర్,బోయిని శ్రీనివాస్,చంద్రశేఖర్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply