ప్రచారంలో దూసుకుపోతున్న 47 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

మంచిర్యాల, ఆంధ్రప్రభ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 47వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొల్లం భీమయ్య గడపగడపకు ప్రచారంలో దూసుకుపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,కాంగ్రెస్ బలపరుస్తున్న భీమయ్య ప్రజల్లో ఆదరణ పెంచుకుంటూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. ఒక అవకాశం ఇస్తే నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేస్తానని ఈ సందర్భంగా అన్నారు. అందుబాటులో ఉంటూ డివిజన్లో ప్రజల సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
