45 Days Cease Fire : మళ్లీ వాయిదా ?! .. Andhra Prabha News

45 Days Cease Fire : మళ్లీ వాయిదా ?! .. Andhra Prabha News

  • ఈ సారి కాల్పులకు విరామం
  • మరో 45 రోజులు గడువు
  • చర్చల్లో పాక్​.. ఈజిప్ట్​ బిజీబిజీ
  • అటు ఇరాన్​ తో ఒమన్​ సంప్రదింపులు

( ఆంధ్రప్రభ, వాషింగ్టన్​ ప్రతినిధి)

అమెరికా, ఇరాన్ మధ్యవర్తులు 45 రోజుల కాల్పుల విరమణకు షరతులపై చర్చిస్తున్నారు. ‘ప్రమాదకర ఉద్రిక్తత’ను నివారించడానికి ఇదే ఏకైక అవకాశం కావచ్చని అమెరికా మీడియా విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. ట్రంప్ గడువు: హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవడానికి ఇరాన్‌కు ట్రంప్ ఒక కొత్త గడువు విధించినట్లు కనిపించింది. టెహ్రాన్ అంగీకరించకపోతే, విద్యుత్ ప్లాంట్లతో సహకీలక ఇరాన్ మౌలిక సదుపాయాలపై బాంబులు వేస్తామని హెచ్చరిస్తూ, అభ్యంతరకర సందేశం జారీ చేసిన తర్వాత, ఆయన “మంగళవారం, రాత్రి 8:00 గంటలకు (ఈస్టర్న్ టైమ్) *భార‌త కాల‌మానం ప్ర‌కారం బుధ‌వారం తెల్ల‌వారుజామున ముగుస్తుంది) అని రాశారు. కీ ఈ జలసంధిని తెరవడానికి ట్రంప్ పలుమార్లు గడువులను ప్రకటించి, ఆపై సవరించారు.

45 Days Cease Fire : అమెరికా హెచ్చ‌రిక‌కు ప్రతిస్పందనగా ఇరాన్ ఉన్నతాధికారులు ఎదురు హెచ్చరికలు జారీ చేశారు. యుద్ధ నష్టాలకు పరిహారం అందే వరకు జలసంధి దిగ్బంధంలోనే ఉంటుందని స్ప‌ష్టం చేశారు. ఇది ఇలా ఉండగా.. పాకిస్థాన్, ట‌ర్కీ దేశాలు రాజీ ప్ర‌య‌త్నంలో ఉన్నాయి. అమెరికా, ఇరాన్ ,చ‌ర్చ‌ల్లో ఉన్నారు. ఇప్ప‌టికే ఆదివారం ఉద‌య‌మే హోర్ముజ జ‌ల‌సంధిని ఇరాన్ తెరిచింది. అమెరికా, ఇజ్రాయెల్ , వాటి మిత్ర దేశాల‌కు అనుమ‌తి లేద‌ని.. హెచ్చ‌రించాయి. ఇదే త‌రుణంలో అమెరికా, ఇరాన్ తో పాకిస్థాన్‌, ట‌ర్కీ చ‌ర్చ‌లు ఊపందుకున్నాయి.
45 Days Cease Fire : హోర్ముజ్ జలసంధి గురించి ఒమన్ ఇరాన్‌తో చర్చలు జరిపింది, వాషింగ్టన్ , టెహ్రాన్‌ల మధ్య సంప్ర‌దింపుల‌కు పాకిస్తాన్ ఈజిప్ట్ కృషి చేశాయని వర్గాలు చెబుతున్నాయి. ఇక భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 10.00 గంటలకు వైట్​ హౌన్​ నుంచి అధ్యక్షుడు ట్రంప్​ మీడియాతో మాట్టాడుతారు. హోర్ముజ జలసంధిసై దాడి .. లేదా.. మరో 45 రోజులు కాల్పుల విరమణపై మాట్టాడే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Leave a Reply