4,000 Kms | 4,000 కి.మీ సైక్లింగ్ రైడ్…

4,000 Kms | 4,000 కి.మీ సైక్లింగ్ రైడ్…
- 6 రోజుల అద్భుత యాత్ర
4,000 Kms | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : రామగుండం రీజియన్1 ఓసీపీ5(Region1 OCP5)లో ఈ పీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వెంకట తిరుపతి రెడ్డి(Venkata Tirupati Reddy) దేశాన్ని ఒక్క దారిలో కలిపే అరుదైన సాహసయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. కాశ్మీర్ శ్రినగర్ నుంచి కన్యాకుమారి వరకు 4,000 కిలోమీటర్ల(4,000 Kms) దూరాన్ని కేవలం 16 రోజుల్లో సైక్లింగ్ చేశారు.
నవంబర్ 1న కాశ్మీర్‌లోని శ్రినగర్ నుండి ప్రయాణం ప్రారంభించిన ఆయన నవంబర్ 16న కన్యాకుమారి చేరుకున్నారు. ఈ ప్రయాణంలో 10 రాష్ట్రాలు(10 states), వేలాది మార్గాలు, వందల కొండచరియలు, విభిన్న వాతావరణాలను దాటి సైక్లింగ్( Cycling) చేయడం ఒక సాహసోపేతమైన ప్రయాణంగా నిలిచిందని తిరుపతి రెడ్డి అన్నారు.
ఫిట్ ఇండియా(Fit India) కార్యక్రమంలో భాగంగా 31 రాష్ట్రాల నుంచి దాదాపు 3,000 మంది సైక్లిస్టులు(3,000 cyclists) దరఖాస్తు చేయగా, కేవలం 150 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం సంపాదించడం తమకు గర్వకారణమని తిరుపతి రెడ్డికి తెలిపారు.


